Repeal GO 282 : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పనిగంటలు జీవో 282 ద్వారా రోజుకు పది గంటలు పని చేయాలని తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్నం లో కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి జీవో కాపీలు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని ఆందోళన జరుగుతున్న ఈ సందర్భంలో కేంద్ర బిజెపి విధానాలను బలపరుస్తూ 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282 ను విడుదల చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని యధావిధిగా ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బిజెపితో రహస్య ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కార్పొరేట్ల అనుకూల విధానాలను పాటించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి చేస్తున్న కుట్రను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే. విజయలక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, ఎఫ్సిఐ అమాలి యూనియన్ అధ్యక్షులు పల్లె నగేష్, పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గంజి నాగరాజు, మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జంజరాల శ్రీనివాస్, సుందరయ్య, సెంట్రింగ్ సొసైటీ అధ్యక్షులు నోముల యాదయ్య, వివిధ సంఘాల నాయకులు పి. సరిత, మిర్యాల శ్రీవాణి, వెంకన్న, సోములు, ఆంజనేయులు, మన్నె శంకర్, రేణుక, నాగలక్ష్మి, నాగమణి, సునీత, రాజేష్, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.