Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lack of protection for dead bodies…! మృతదేహాలకు రక్షణ కరవు…!

-- మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు -- సమాచారం గోప్యత పై బంధువులు ఆగ్రహం

 

మృతదేహాలకు రక్షణ కరవు…!

— మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

— సమాచారం గోప్యత పై బంధువులు ఆగ్రహం

ప్రజా దీవెన/ యాదాద్రి భునగిరి: బతికున్నవారికి  సరైన వైద్యం లభిస్తుందో లేదో కాని  మృత దేహాలకు రక్షణ మాత్రం లేదని ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. మార్చురీ లోని మృతదేహాన్ని ఎలుకలు కొరికిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో జరిగిoది.  ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచిన మృతదేహం లో చోటు చేసుకుంది.

మృత దేహం ముఖం, చెంపలు, నుదిటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండటంతో ఆ మేరకు  మృతుని బంధువులు అనుమానo వ్యక్తం చేస్తున్నారు. కాగా సమచారం పొక్కకుండా ఉండేందుకు ఆసుపత్రి సిబ్బంది యత్నించారని , పోలీసులు తీసిన ఫోటోలలో అనువాయితి ఉండటంతో నిర్లక్ష్యం వహించి, జరిగిన సంఘటనను బయటకు పొక్కకుండా ఉండేందుకు సిబ్బంది చేసిన నిర్వాకంపై బంధువులు, కుంటుబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘటనకు సంబంధించి పూర్వ పరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు.ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది.

దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యా భర్తలు తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు.ఐతే రవికుమార్‌ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ తెలుపగా  డెడ్ బాడీని మార్చురీకి తీసుకెళ్లిన సమయంలో ముఖంపై ఎలాంటి గాయాలు, గాట్లు కనిపించలేదని భవనగరి టౌన్ ఇన్ స్పెక్టర్ సుధీర్‌కృష్ణ చెప్పారు.