వాలీబాల్ క్రీడలో రాణించి కోదాడకు వన్నె తేవాలి. లక్ష్మీనారాయణ రెడ్డి
Lakshmi Narayana Reddy: ప్రజా దీవెన ,కోదాడ:క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టిపిసిసి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి(Lakshmi Narayana Reddy)అన్నారు శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో ది కోదాడ వాలీబాల్ అసోసియేషన్ (vollyball association)ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్(tournament )విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడల్లో కోదాడకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది అన్నారు ఆ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు.
కాగా టోర్నమెంట్లో (tournament)ప్రథమ బహుమతి కోదాడ జట్టు ద్వితీయ బహుమతి హుజూర్నగర్ తృతీయ బహుమతి ముత్తుగూడెం చతుర్ధ బహుమతి నడిగూడెం జట్లు గెలుచుకున్నాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ(St SC BC minority)నాయకులు పంది తిరపయ్య, వాలీబాల్ జాతీయ క్రీడాకారులు పంది కళ్యాణ్, నరసింహ రావు, చిన్న, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, టోర్నమెంట్ దాతలు, షేక్ ఆదామ్,బాబా శ్రీనివాస్, న్యాయవాది గంధం కోదండపాణి, క్రీడాకారులు జూలూరి భద్రం, టోర్నమెంట్ నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు గంధం రంగారావు ప్రకాష్ కొండలు, తదితరులు పాల్గొన్నారు.