ప్రజా దీవెన, కోదాడ: మకు, శాంతికి ప్రతిరూపం క్రిస్మస్ అని డిసిసిబి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి కోదాడ ప్రముఖ లాయర్ కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు డిసెంబర్ 25.క్రిస్మస్ సంద ర్బంగా వారు కట్ చేసి కోదాడ ప్రాంత క్రైస్తవులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి నివాసంలో కోదాడ ప్రముఖ న్యాయవాది కే ఎన్ ప్రసాద్ నివాస గృహాలలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు నిర్వహించు కుంటున్న క్రిస్మస్ కు ఎంతో ప్రత్యే కత ఉందని,క్షమించే గుణం ఉన్న వారు క్రైస్తవులని, వారందరూ పేదలకు ఉచిత సహాయం చేస్తా రని, ప్రేమకు, శాంతికి ప్రతిరూపం క్రిస్టమస్ అని అన్నారు.
ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే హింసకుతావులేదని, శాంతి, ప్రేమ మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారంగుల అంజన్న గౌడ్ డేగ శ్రీధర్ డాక్టర్ బ్రహ్మం పంది కళ్యాణ్ సురేష్ సుధాకర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు