అన్నదానం చేసిన గజ్జల శివారెడ్డి
పూజలో వందలాదిగా పాల్గొన్న మహిళలు
ఘనంగా నిర్వహించిన గురు స్వామి నరసింహ చారి
Lakshmi Rajagopal Reddy : ప్రజా దీవెన నాంపల్లి :జనవరి 9 నాంపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో బుధవారం రోజున అయ్యప్ప స్వాముల మహా పడిపూజ కార్యక్రమం మండలంలోని అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుశీల ఫౌండేషన్ చైర్మన్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి చందనం అభిషేకం నిర్వహించారు అయ్యప్ప స్వాములను భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టమని పూజను చూడడం కూడా ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు నాంపల్లి మండల అభివృద్ధికి సహకరించుటకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సేవలందించుటకు ముందుంటామని ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి అందించాలని కోరారు.
ఈ విషయంతో పూజలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు భక్తులు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు ఈ పూజా కార్యక్రమాన్ని మండల అయ్యప్ప గురుస్వామి తల్లోజు నరసింహ చారి నాంపల్లి శ్రీను ఆధ్వర్యంలో భజనలతో పాటపాటలతో అయ్యప్ప స్వామి వేషధారణతో భక్తులను ఆకట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి తన సొంత ఖర్చులతో పూజా కార్యక్రమం నిర్వహణ అన్నదాన ప్రసాదం స్వయంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమం నిర్వహించారు అనంతరం గజ్జల శివారెడ్డికి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి కి శాలువాలతో అయ్యప్పస్వాములు సన్మానించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు రఘుపతి రెడ్డి పెద్దిరెడ్డి రాజు మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య నాంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు కామిశెట్టి చత్రపతి యాదయ్య అయ్యప్ప స్వాములు పూల యాదగిరి బొడ్డుపల్లి శీను. వ్యాపారవేత్తలు ఆలంపల్లి ఆనంద్ కుమార్ కోట రఘునందన్ పున్న కోటేశ్వర్ సంగెపు గణేష్ తదితరులు పాల్గొన్నారు