Lakshminarayana Reddy: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలలో లభించే పుస్తకాలను చదివి ఉద్యోగాలు సంపాదించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నాడు మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోపందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞానకేంద్రం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించార ముందుగా వైవి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పందిరి నాగిరెడ్డి గ్రంథాలయం ఏర్పాటు అభినందనీయం తెలిపారుపందిరి .గ్రంథాలయం ను విద్యార్థులు ఉపయోగించుకొని,ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని,అదేవిధంగా ఉద్యోగాలు సాధించుకోవచ్చని అన్నారు.
ప్రభుత్వం నుంచి తన వంతుగా సహకారం అందిస్తానని అన్నారు. సహకార కళాశాల సీఈవో ఎస్ఎస్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో టి పి సి సి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మి నారాయణ రెడ్డి,మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి,కోదాడ మువిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు,పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సెక్రటరీ ఇమ్మడి సతీష్ బాబు,ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటేశ్వర రావు,సీనియర్ జర్నలిస్టు హరి కిషన్,గ్రామ పెద్దలు సత్య నారాయణ రెడ్డి,ఇంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ప్రభాకర్ రెడ్డి,రామకృష్ణ, నాగేశ్వర రావు,శ్రీ పాల్ రెడ్డి,అప్పిరెడ్డి పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించిన10 మంది అభ్యర్థులను పందిరి ఫౌండేషన్ తరపున ముఖ్య అతిథులు శాలువాతో సన్మానించి బొకే మరియు మెమెంటో అందజేశారు.