Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lakshminarayana Reddy: మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

*మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. లక్ష్మీనారాయణ రెడ్డి

ప్రజా దీవెన, కోదాడ: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల శుక్రవారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్.బి.ఐ గవర్నర్ గా,ఆర్థిక మంత్రిగా 2004 నుంచి 2014 వరకు భారత దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలు అందించారని ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను చేపట్టి దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి నిరంతరం వారు కృషి చేశారని వారి సేవలను స్మరించారు.

ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ సర్పంచ్ పారాసీతయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పిడతల శ్రీను,కాంపాటి శ్రీను, డేగ శ్రీధర్ కౌన్సిలర్లు కోటిరెడ్డి, గంధం యాదగిరి, షాబుద్దీన్, నిరంజన్ రెడ్డి, కర్రీ సుబ్బారావు, పెండెం వెంకటేశ్వర్లు,బాగ్దాద్, భాజాన్, దాదావలి,సిలివేరు వెంకటేశ్వర్లు,రాంబాబు, ముస్తఫా,మునీర్, జహీర్,దేవమణి, మోహన్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు.