Lakshminarayana Reddy : ప్రజా దీవెన, కోదాడ: వాలీబాల్ క్రీడాకారులకు కోదాడ ఎన్.ఆర్.ఎస్ ఐఐటి ఫౌండేషన్ కళాశాల వారు అందిస్తున్న సహాయ సహకారం అభినందనీయమని ఎడమ కాలువ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ కే బషీరుద్దీన్ లు అన్నారు. ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కళాశాల వారు అందించిన ఐదువేల విలువగల వాలీ బాల్స్ ను క్రీడాకారులకు అందించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇటీవల సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్ కు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జట్టు తరఫున కెప్టెన్ వహించిన తురక సాయి రాజును శ్యామ్. వెయిట్ లిఫ్టింగ్ లో ప్రధమ బహుమతి సాధించిన ఎస్ పవిత్రులను వీరు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ఎన్ ఆర్ ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వేణుగోపాల్ మై హోం ఎస్టేట్ మేనేజర్లు చెరుకు అశోక్ విష్ణువర్ధన్ రావు ఎస్సై కొంగల వెంకటేశ్వర్లు ఎస్.కె ఖలీద్ మంద శ్రీనివాసరావు సూర్య నారాయణ రావు పంది కళ్యాణ్ ఈదులకృష్ణయ్య క్రీడాకారులు పాల్గొన్నారు