Lakshminarayana Reddy:ప్రజా దీవెన,కోదాడ: దేశంలో మహిళలకు మొట్టమొదట ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని స్థానిక కోదాడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు విద్యావంతులుగా ఎదిగే క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది.
ఎంతో మంది మహిళల జీవితాలలో వెలుగులు నింపిన దీరవనిత సావిత్రీ బాయిపూలే అని గుర్తు చేశారు చదువు ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది కుటుంబంలో మహిళ చదువుకుంటే కుటుంబంలోకొన్ని తరాలు విద్…