Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lakshminarayana Reddy : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టు లు ఉపయోగ పడతాయి

* ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం ప్రశంసనీయం

*విద్యకు పేదరికం అడ్డు కాదు:

•కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన. లక్ష్మీనారాయణ రెడ్డి,అంజిన్ గౌడ్

Lakshminarayana Reddy : ప్రజా దీవెన, కోదాడ: గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు గురువారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రాలను వారు విడుదల చేసి మాట్లాడారు. సమాజంలో ఉన్న సమస్యలను వెలికి తీసి పరిష్కారానికి మార్గం చూపడంతో పాటు విద్యారంగా అభివృద్ధి కోసం కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టాలెంట్ టెస్టులు రాయడంతో విద్యార్థులకు పరీక్షా అంటే భయాందోళనలు దూరమవుతాయినిఅన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యార్హతలతో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అందరూ పేదవారని పేదరికంలో పుట్టడం తప్పు కాదని పేదరికంలోనే చనిపోవడం తప్పు అవుతుందని విద్యార్థులు పేదరికం జయించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

 

 

విద్యకు పేదరికం అడ్డు కాదని తెలిపారు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థులకు అందిస్తున్న మార్గదర్శకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కాగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి టాలెంట్ టెస్ట్ కు కోదాడ నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు వందమందికి పైగా హాజరయ్యారు… గ్రాండ్ టెస్ట్ ముగిసిన అనంతరం కీ పేపర్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ విడుదల చేశారు.కోదాడ ఎలక్ట్రానిక్ అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ కళాశాల సీఈఓ ఎస్ఎస్ రావు త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్, టి యు డబ్ల్యూ జే 143 జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్ రావు, టి యు డబ్ల్యూ జే హెచ్ 143 స్టేట్ కౌన్సిల్ మెంబర్ బంకా వెంకటరత్నం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్ ,ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ, ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు కొలిచలం నరేష్,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్ పూర్ణచంద్రరావు, తంగళ్ళ పల్లి, లక్ష్మణ్ తోటపల్లి నాగరాజు, చీమ శేఖర్, వాసు, శ్రీకాంత్, నజీర్, సత్య రాజు సునీల్. నాగేంద్రబాబు, సతీష్. తదితరులు పాల్గొన్నారు