Lawers Bill : ప్రజా దీవెన , నల్లగొండ : కేంద్ర ప్రభు త్వం ఇటీవల న్యాయవాద చట్టం 1961 ను మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించడం మూలం గా న్యాయవాద వృత్తి ప్రమాదంలో పడుతుందని నలగొండ బార్ అసో సియేషన్ అధ్యక్షులు కే అనంతరెడ్డి కార్యదర్శి ఎం నాగేష్ ఆల్ ఇండి యా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంక రయ్యలు అన్నారు. గురువారం నల్లగొండలో ఐలు ఆధ్వర్యంలో బా ర్ అసోసియేషన్ వాల్ నందు ఐలు సంఘం ముద్రించిన బుక్ లేట్ లను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర స్తుతం ఉన్న చట్టాలనే కొనసాగిం చాలని విదేశీ లాయర్లను అనుమ తించవద్దన్నారు. న్యాయవాదుల చట్టం సవ రణ బిల్లులో లాయర్ల రక్షణ సంక్షే మం తదితర అంశాల ను విస్మరించారన్నారు.
న్యాయవాదులతో సం ప్రదించ కుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొ ని కొత్త చట్టాన్ని తీసుకొస్తే న్యాయ వృత్తి మనుగడకే ప్రమాదక రంగా ఉంటదని అందుకే చట్ట సవ రణ ను ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జూని యర్ న్యాయవాదులు ఎం నాగి రెడ్డి, పి శేఖర్ పి బ్రహ్మచారి, డి నర్సాజి, ఎం బాలయ్య, నగేష్ మసీయొదిన్, కిషోర్ కుమార్, సిహెచ్ జైపాల్, ఏ లాలయ్య, నజీ రుద్దీన్, లింగయ్య, రమేష్, ప్రకాష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు