Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Legislature budget meetings: అసెంబ్లీ సమావేశాలకు వేలాయే

–ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభా నికి నిర్ణయం
–వారం రోజుల పాటు కొనసాగిం చేందుకు సూత్రప్రాయ అంగీకారం
–ఈ నెల 25, 26వ తేదీన పూర్తి స్థా యి బడ్జెట్‌, 31లోపు ద్రవ్య బిల్లు ఆ మోదం అనివార్యం
–రైతు భరోసా పథకంపై శాసన సభ లో విస్తృత చర్చతో పాటు రాష్ట్ర చి హ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపైనా
చర్చలు

Legislature budget meetings:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (State Legislature Budget Sessions) ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభించేందుకు గురువారం హైదరాబాదులో జరిగిన కీలక సమావేశం నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను (budget)ప్రవేశపెట్టవచ్చని సమాచా రం. ఈ మేరకు సమావేశాల ప్రారం భ తేదీని ప్రభుత్వం ఖరారు చేసిం ది. బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల లోపే పూర్తి చేసి, రాష్ట్ర వ్యయా ల కు సభ అనుమతి పొందాల్సి ఉ న్నందున గురువారం శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. శాసన మండలిచైర్మన్‌ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండ ప్రకాష్‌, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, రామచంద్రనాయక్‌, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి, డీజీపీ జితేందర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘ఓట్‌–ఆన్‌–అకౌంట్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (State Govt) కూడా ఫిబ్రవరి 10న ‘ఓట్‌–ఆన్‌–అకౌంట్‌’ బడ్జెట్‌ను తీసుకొచ్చింది.

2024–25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.2,75, 891 కోట్లతో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, శాసన సభ అనుమతి పొందింది. ఇందులో నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై కోసం రూ.78,911 కోట్ల వ్యయానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 1 నుంచి మళ్లీ వ్యయాలకు చిక్కు వచ్చి పడు తుంది. ఈ దృష్ట్యా పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, శాసనసభ (Legislature)ఆమోదం పొందాల్సి ఉంది. అందుకే ఈ నెల 24 నుంచి సమావేశాలను ప్రారం భించాలని స్పీకర్‌ అధ్యక్షతన భేటీ లో నిర్ణయించారు. కేంద్రం 23న లోక్‌సభలో 2024–25కు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అందు లో గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత (Share of taxes, centrally sponsored పథకాల (సీఎస్‌ఎస్‌) కింద వచ్చే నిధులను రాష్ట్రం పరిశీ లిస్తుంది. వాటి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు తుది రూపునిచ్చి అసెంబ్లీ లో పెట్టనుంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం పొందాలి. ఈ నేపథ్యంలో సమావే ఇల్శాలను 24న ప్రారంభించి 28న ఆదివారం మినహా 31వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ పొడిగించాలనుకుంటే.. ఈ నెల 31లోపే ద్రవ్య మినిమయ బిల్లుకు సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది.

భరోసాపై చర్చలే చర్చలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘రైతు భరోసా’ (‘Farmer Assurance’) పథకంపై ఈ సమావేశాల్లోనే చర్చను చేపట్ట నుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలోని క్యాబినెట్‌ సబ్‌ కమి టీ బుధవారం నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తూ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని జాతీయ రహదారుల్లో కోల్పోయిన, ధన వంతుల భూములకు వర్తింప జేసిం దని కాంగ్రెస్‌ సర్కారు ఆరోపిస్తోంది. పైగా.. రైతు భరోసాకు కొత్త విధి విధానాలు తయారు చేస్తామని, అసెంబ్లీలో చర్చకు పెట్టి, సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రైతుబంధు కింద కానీ, రైతు భరోసా ద్వారా కానీ అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదు. ఏటా జూన్‌, జూలై నెల ల్లో రైతుబంధు ఇచ్చేవారు. ఇప్ప టికే ఆలస్యమై, రైతులు పెట్టుబడి సాయం కోసం చూస్తున్నందున తప్పకుండా ఈ సమావేశాల్లోనే రైతు భరోసాపై చర్చ చేపట్టి, అనం తరం విధివిధానాలు రూపొందించా ల్సి ఉంటుంది. అందుకే, లఘు చర్చ కింద పథకంపై చర్చను చేప ట్టి, సభ్యుల అభిప్రాయాలు తీసు కోనుంది. ఇదే సందర్భంలో రైతు రుణ మాఫీ గురించి కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం (Statue of Telangana Mother) రూపక ల్పనపైనా అసెంబ్లీ బడ్జెట్‌ సమా వేశాల్లో చర్చ చేపట్టవచ్చని తెలు స్తోంది. వీటిపై గతంలో సీఎం రేవం త్‌రెడ్డి సచివాలయంలో నిపుణుల తో చర్చించారు. చిహ్నం నుంచి చార్మినార్‌, కాకతీయ కళా (Charminar, Kakatiya Kala)తోరణాన్ని తొలగిస్తారంటూ కథనాలు రావడంతో తీవ్ర వివాదం రేగింది. దాంతో ప్రభుత్వం అప్పట్లో అంశా న్ని వాయిదా వేసింది. అయితే, శాసన సభలో చర్చ చేపట్టి, సభ్యు ల అభిప్రాయాలు తీసుకునే అవకా శం ఉంది. ఇవికాక సర్కారు కొన్ని కీలక బిల్లులను కూడా తీసుకొచ్చి సభ ఆమోదం పొందుతుందని సమాచారం. ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలే దంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా యం టూ విమర్శిస్తున్నారు. వీటిపై ప్రభు త్వాన్ని అవి గట్టిగా ప్రశ్నించే అవకాశాలున్నాయి.