నిర్మల్‌లో చిరుత సంచారం
ప్రజా దీవెన/నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తున్నది. విశ్వనాథ్ పేట్ నుంచి బంగల్ పేట్ వెళ్లే దారిలోని పంట పొలాల సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది.
దీంతో సమాచారాన్ని అధికారులకు చేరవేయగా ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పాద ముద్రలను సేకరించారు. అది ఎటువైపు వెళ్లి ఉంటుందనే విషయమై ఆరాతీస్తున్నారు.
కాగా, చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని సూచించారు.అయితే పులిని వీలైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.