Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi Anti-Worker Policies : మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిగటిద్దాం

–4లేబర్ కోడ్ ల అమలుకు వ్యతిరేకంగా పోరాడుదాం

–మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

–సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్

Modi Anti-Worker Policies :ప్రజాదీవెన నల్గొండ :కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం సీఐటీయు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షత స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గత వందేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు.

 

కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.జిల్లాలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహించడం కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వాడల్లో,పని ప్రదేశాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు డి మల్లేష్, ఎండి. సలీం, అవుతా సైదయ్య, సహాయ కార్యదర్శులు నల్ల వెంకటయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణచారి, నాయకులు తిప్పర్తి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.