LHPS : ప్రజాదీవెన, నల్గొండ టౌన్
నలగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ జరిగిన ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ సక్రు నాయక్ పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోర్బోలీ భాషా నూ రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన అన్నీహామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవోజి నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్ , ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్, రవి నాయక్, కోశాధికారి కిషన్ నాయక్ , మహిళా సంఘం అధ్యక్షురాలు దేవిబాయ్ , పట్టణ అధ్యక్షులు యాదగిరి నాయక్ , రాయమల్ నాయక్ , శ్రీనివాస్ నాయక్ ,నరేష్ నాయక్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.