Life Imprisonment: జిల్లా మొదటి అదనపు కోర్టు అధనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవిందర్ ను సన్మానించి జిల్లా ఎస్పి..!
ప్రజాదీవెన, సూర్యాపేట:
Life Imprisonment: ఆత్మకూరు (ఎస్) పోలీసు స్టేషన్ పరిధిలో 2023 సంవత్సరంలో నమోదైన వృద్దిరాలపై హత్యాచారం, హత్య, ఇంట్లో దోపిడీ కేసులో సూర్యాపేట జిల్లా కోర్టు న్యాయమూర్తి నిందితునికి జీవిత ఖైదీ శిక్ష, జరిమానా విధిస్తూ ఈనెల 7 వ తేదిన ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. ఈకేసులో బాధితుల తరపున కేసు వాదనలు వినిపించిన జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవిందర్ ను ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు గారితో కలిసి సన్మానించి అభినందించారు.
శిక్ష పడడంలో బాగా పని చేసిన పర్యవేక్షణ చేసిన పోలీసు అధికారులను, కోర్టు డ్యూటీ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో పోలీస్ శాఖ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యమైన దర్యాప్తును కొనసాగిస్తుంది, జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నందు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ కోర్టులతో సమన్వయంతో పని చేస్తున్నారు.
బాధితులను, సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరిస్తున్నారు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం క్రైమ్ రికార్డ్ బ్యూరో నుండి కోర్టులలో కేసుల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాము అన్నారు. నేరాల్లో పక్కా ఆధారాలు సేకరించి రికార్డ్స్ నందు నమోదు చేసి కేసుల దర్యాప్తులో జోడీస్తున్నాము అని తెలిపినారు. పోలీసు వేగవంతమైన చర్యలతో వివిధ నేరాల్లో నేరాలకు పాల్పడ్డ వారికి త్వరగా శిక్షలు అమలు అయ్యేలా పనిచేస్తున్నాము గత కొంతకాలంగా శిక్షల శాతం పెరిగినది అని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి గారి వెంట జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు, జిల్లా కోర్టు పోలీస్ లైజన్ అధికారి హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.