ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరికి జీవితశిక్ష
ప్రజా దీవెన/ భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(fro) హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది భద్రాద్రి కొత్తగూడెం న్యాయస్థానం. ఫారెస్ట్ రేంజ్ అధికారి హత్య(murder case)కేసులోని నిందితులు మడకం తులా, పోడియం నంగా లను దోషులుగా తేల్చిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. న్యాయస్థానం(court)ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ జీవిత(life)ఖైదుతో పాటు 1000/- రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించారు. కాగా సంఘటన జరిగిన వెంటనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్(remond)నిమిత్తం కోర్టునకు తరలించడం, హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.వినీత్ (sp Vineeth)తెలిపారు. నేరం చేసిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు (case details) ఉన్నాయి. గతేడాది నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం, ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన(murder) విషయం తెలిసిందే. అయితే ఇద్దరు నిందితులకు శిక్ష పడేవిధంగా కృషిచేసిన విచారణాధికారి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్(public prasicuter) రాధాకృష్ణ, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రవి,లైజన్ ఆఫీసర్ వీరబాబు లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.