ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివే యాలని,జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న లింగంగౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్రకులాల వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నవారికి ఉద్యోగాలు వచ్చాయని అగ్రకులాల జనాభా ఆరు శాతం ఉంటే వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నార ని,కానీ దేశవ్యాప్తంగా ఓబీసీల జనాభా 50% పైగా ఉంటుందని రిజర్వేషన్ల శాతం మాత్రం 27 శాతం మాత్రమే కనుక ఓబీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని జాజుల డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో తాటికొండ విక్రం బాలగోని బాల రాజు, ఐలి వెంకన్న కుల్కచర్ల శ్రీని వాస్,కుందారం గణేశ చారి ఈడిగ శ్రీనివాస్ నరసింహ నాయక్, నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
