Lingangaud : ప్రజా దీవెన, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఏంఎల్ఏ బీర్ల ఐలయ్య పై లేని పోనీ అరోపణలు చేస్తున్న గొంగడి సునీతా మహేందర్ రెడ్డిలకు తగిన గుణపాఠంచెపుతామని బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజు ల లింగంగౌడ్ హెచ్చరించారు. ఒక బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఏంఎల్ఏ అయితే ఓర్వలేక భార్య భర్తలు విశం చిమ్ముతున్నారని అన్నారు. ఆలేరు శాసన సభ్యు లు బీర్ల ఐలయ్య పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన గొంగడి సునీత మహేందర్ రెడ్డికి తగిన బుద్ధి చెబు తామని హెచ్చరించారు. రాజకీ యంగా ఎదుర్కోలేక బురద జల్లా లని చూస్తున్నారన్నారు.
నీతికి నిజాయితీకి మారుపేరైనా బీర్ల అయిలయ్యపై భూ దందాలు అని లేని పోనీ అరోపణలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల ని లేకపోతే తగిన బుద్ధి చెపుతా మని హెచ్చరిస్తున్నా.బడుగు బల హీనవర్గాల నాయకుడైన మా ఎమ్మెల్యేని రాజకీయంగా ఎదుర్కొ నే దమ్ము లేక ఇలాంటి కుట్రలు, కు తంత్రాలు చేస్తున్నారని ఆరోపిం చారు.