Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lingangaud : దౌర్జన్యాలను ఎదిరించిన సమర యోధుడు వడ్డే ఓబన్న

Lingangaud : ప్రజా దీవెన, హైదరాబాద్: స్వాతం త్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఘన నివాళి అర్పిం చారు.ఈ సందర్బంగా జాజుల మాట్లాడుతు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఆయన చరిత్ర చిరస్మరణీయమన్నారు.

వడ్డే ఓబన్న విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజం నిర్మాణం కోసం కృషిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ పాల్గొన్నారు.