Lions Club: ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రతి ఒక్కరు పోషకాహారం తీసు కొని ఆరోగ్యంగా ఉండాలని మండ ల వైద్యాధికారి డాక్టర్ పాల్వాయి వెంకటేష్, లయన్స్ క్లబ్ (Lions Club) పాస్ట్ జోన్ ఛైర్మెన్ ఎర్ర శంభు లింగా రెడ్డి (Sambhu Linga Reddy)లు అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 13వ వారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వెంకటేష్, శంభు లింగా రెడ్డి (Sambhu Linga Reddy) లు మాట్లాడుతూ మహిళలు ముఖ్యoగా వ్యక్తిగత పరి శుభ్రత,పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు.
నెల, నెలా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.లయన్స్ క్లబ్ వారు స్వచ్చంద కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల జైపాల్ రెడ్డి (Chamala Jaipal Reddy) పుట్టిన రోజు సందర్బంగా గర్భణి మహిళలలకు, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు,క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, ప్రతినిధులు దునక వెంకన్న, రామడుగు వెంకట్రామశర్మ, వావిలాల రామలింగయ్య శర్మ, దామెర్ల శ్రీనివాస్, మద్ది వెంకట రెడ్డి, నిమ్మల వీరస్వామి, పిహెచ్ఎన్ రాములమ్మ,సూపర్ వైజర్లు దయామణి,మరియాహెల్త్ అసిస్టెంట్లు భాస్కర్, సుమతి ,ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు (Asha workers)వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.