Liquor shops closed : ప్రజా దీవెన, హైదరాబాద్: మందు బాబులకు మతిబోయే సమాచారం విలువరించింది తెలంగాణ ప్రభు త్వం. తెలంగాణ రాష్ట్రంలో మూ డు రోజుల పాటు మద్యం దుకాణా లు బంద్ కానున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో మద్యం దుకాణాలు మూత పడబోతున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నిక ల పోలింగ్ నేపథ్యంలో ఈ నిర్ణ యం తీసుకుంది ఎన్నికల సంఘం.
ఇక ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ నాలుగు జిల్లాల్లో ఎ మ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సం గతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగనుంది. అందుకే వైన్స్ లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.