బిగ్ బ్రేకింగ్, ఆత్మహత్యకు దారితీసిన సోషల్ మీడియా ప్రేమ
LoversSusaid: ప్రజా దీవెన, కరీంనగర్: ముక్కు మొహం తెలి యకుండా సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన ప్రేమ ఆత్మహత్య కు దారితీసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని వాళ్లకు వాళ్లే నిర్ణయించుకున్న సదరు ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుoది.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మిను గు రాహుల్(18)కు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండ లం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక మాధ్య మంలో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమ విషయం తమ కుటుంబంలో ఒప్పుకుంటారో లేదో అన్న అనుమా నంతో క్షణికావేశంలో నిండు ప్రాణాలు బలి తీసుకున్నారు.
ఆలోచన పరిణితి లేని వారిద్దరూ జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలు ముకున్నాయి. చేతికొచ్చిన కన్నబిడ్డలు అర్ధాంతరంగా నిండు జీవి తాలను ముగించుకున్నారని లబోదిబోమన్నారు.