— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Lucky Draw Fraud : ప్రజా దీవెన, మిర్యాలగూడ: అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని లక్కీ డ్రా ల పేరుతో బ్రోచర్లను చూపుతూ ఖరీదైన వస్తువులు ఇస్తాం అంటూ మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నలగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ డి.ఎస్.పి ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ పోలీ స్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని హౌసిం గ్ బోర్డ్ లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ మ ల్టీ లెవెల్ సంస్థను కొమ్ము రమేష్ కొ మ్ము కోటేశ్వరరావు బచ్చల కూరే శ్రీను లు స్థాపించి నెలకు ₹1000 చొప్పున 15 నెలలపాటు కడితే ప్ర తి నెల లక్కీ డ్రా తీసి డ్రాలో వచ్చిన పదిమందికి విలువైన వస్తువులు ఇ స్తామని ఆశ చూపి 15 నెలలో డ్రా లో రాకున్నా చివరికి కఠిన మొత్తా న్ని అంతా విలువ చేసి వస్తువులు లేదా కట్టిన మొత్తం తిరిగి ఇస్తామని ప్రచారం చేస్తూ ఎంపిక చేసుకున్న ఏ జెంట్లకు కమిషన్ ఆశ చూపి అమాయక ప్రజలను చేర్పిస్తూ ఎక్కువ మందిని జాయిన్ చేస్తే ఎక్కువ కమిషన్ ఇస్తామని ఏజెం ట్లకు ఆశ చూపి ఎక్కువ మందిని సభ్యులు చేరే విధంగా ప్రతినెల డ్రా లో ఆకర్షణ మైనా బ్రోచర్లతో జనా లను మోసం చేస్తూ 2143 మంది జాయిన్ చేసి ఒక కోటి 85 లక్షల 79 వేల రూపాయలను సొమ్ము చేసుకున్నారు.
సుమారు 50 లక్షల రూపాయలతో కట్టిన సభ్యులను నమ్మించడం కోసం లక్కీ డ్రా గిఫ్ట్ రూపంలో కొన్నవి చూపిస్తూ, స్కీ మ్లో కట్టిన వారికి గిఫ్టులు ఇవ్వక సమయానికి డబ్బులు ఇవ్వక పో వడంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తూ బాధితులకు దొరకకుండా తిరుగు తున్నరు. మోసపోయాం అని తెలు సుకున్న బాధితులు మిర్యాలగూడ ఒకటో పట్టణంలో ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి న మ్మదగిన సమాచారం మేరకు ఈ దులగూడ చౌరస్తా వద్ద బైక్ పై వె ళుతున్న గా నిందితులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. వారి వద్ద నుండి 6,55000 వేల నగదు రెండు ఓపెన్ ప్లాట్ల దస్తా వీధులు రెండు టూ వీలర్లు వాషింగ్ మిషన్, లాప్ టాప్, కంప్యూటర్లను స్వాధీ నం చేసుకున్నారు. ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరు ఎటువంటి మల్టీ లెవెల్ లక్కీ డ్రాల పేరిట ఏర్పాటు సంస్థల్లో సభ్యులు గా చేరి మోసపోరాదని పూర్తిగా మోసపూరితమైనవి ఉంటాయని, ఇట్టి సంస్థలు మోసపూరితమైనవి ఉంటాయని ప్రజలు సొమ్ముతో ఏ జెంట్లు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసి కమిషన్ పేరు మీద డబ్బులు ఖర్చు చేసి చివరగా బోర్డు తిప్పేసి ప్రజలు మోసం చేస్తూ ఉంటారన్నా రు. మల్టీ లివర్ పేరుతో ఎవరైనా స్కీములు పెడుతుం సమాచారం ను పోలీసులకు తెలియజేయాలని ఇటువంటి సంస్థలు ఏజెంట్లుగా చే రిన నేరస్తులు అవుతారని వార న్నారు రిజిస్టర్ చిట్టి సంస్థలను మా త్రమే నమ్మాలని ప్రజలు ఎటువంటి స్కీములను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డిఎస్పి రా జశేఖర్ రాజు ఆధ్వర్యంలో కేసును చేదించిన సీఐ మోతిరామ్, ఎస్సై సైదిరెడ్డి కానిస్టేబుల్ శ్రీను నరసింహ సైదులు వీరబాబు తమ్మియుద్దిన్ సైదులు ప్రసాదు లను ఎస్పీ అభి నందించారు.