Madhava Reddy : ప్రజా దీవన, నారాయణపురం : నారాయణపురం మండల పరిధిలోని గుడిమల్కాపురం పి టి సి ఎంపీటీసీ పరిధి నుండి రాచకొండ కడిల బావి తండా,తుంబావి తండా మరియు వెంకం భావి తండా గ్రామ పంచాయతీలను కలిపి నూతనంగా ఎంపీటీసీ పరిధి ఏర్పాటు చేయుట గురించి శుక్రవారం నారాయణపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ మాధవ రెడ్డి,జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ బాలునాయక్,మండల్ నాయకుడు గోవర్ధన్ నాయక్,ఎస్టీషియల్ అధ్యక్షుడు కరంతోట్ రమేష్ నాయక్,మండల్ నాయకుడు రవీందర్ నాయక్,మండల్ నాయకుడు ప్రజ్ఞా నాయక్, లచ్చనాయక్,నాగరాజు,కే శీను నాయక్,మోతియా నాయక్,రాజు నాయక్,గన్ననాయక్,సిద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు.