–మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు
— జియాలజీ శాఖ అధిపతి డా మధుసూదన్ రెడ్డి
Madhusudan Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజి (Mahatma Gandhi University Geology,), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొం డ జిల్లా భూగర్భ జలాల మూలాలు సుస్థిరత, నిర్వహణ పై జియాలజి విద్యార్థు లకు మూడు రోజుల జూ లై 24, 25, 26 తేదీల్లో శిక్షణ కార్య క్రమాలు నిర్వహించనున్నట్లు సెంట్ర ల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త డా. ఎస్. ఎస్. విఠల్, జియాలజీ శాఖ అధిపతి డా మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy)తెలిపారు. సైన్స్ కళాశాల వేదికగా జరగనున్న కార్యక్రమంలో తెలంగా ణ భూగర్భ జలాలు, హై డ్రోజి యాలజీ ప్రాథమిక అంశాలు, వర్షపా తం, భూగర్భ జలాల పరిశీలన మరియు అంచనా, మ్యాపింగ్ టెస్ట్ ద్వారా పరిశీలన, ఫ్లోరోసిస్, భూగర్భ జలాల చట్టాలు, కఠిన శిలల్లో భూగర్భ జలాలు, సుస్థిరత అంశాలపై విద్యార్థులకు పరి శోధకులకు శిక్షణ (training)ఇవ్వనున్నారు.
రెండు అంచె ల్లో జరగనున్న శిక్షణ కార్యక్రమంలో రెండు రోజుల శిక్షణ (training)అనంతరం మూడవ రోజు అధు నాతన పరికరాల ద్వారా జల వనరుల పరి శీలన, అంచనా, నిర్వహణ అంశా లపైశిక్షణాలు ఇవ్వడం ద్వారా విద్యార్థులను ఈ రంగంలో నిష్ణా తులనుగా తీర్చిదిద్దవచ్చునని సెంట్ర ల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (Central Ground Water Board)సైంటిస్ట్ డా ఎస్ ఎస్ విఠల్ తెలిపారు. రైతులు సామాన్యులు సాంప్రదా యక పద్ధతుల్లో జల అన్వేషణల వల్ల అనేక రకాలుగా నష్టపోతున్న దృష్ట్యా నిష్ణాతు లైన జియాలజిస్టు ల అవసరం ఎంతైనా ఉందని తెలి పారు. కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజినల్ డైరెక్టర్ శ్రీ జి కృష్ణమూర్తి హాజరుకానున్నారు. ఈ సంద ర్భంగా రిజిస్ట్రార్, ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ నాణ్య మైన మానవ వనరుల అభివృద్ధి లో ఎంజియూ ముందుకు సాగాలని, రాబోవు రోజుల్లో జలశక్తి మంత్రిత్వ శాఖ సహకారంతో దీర్ఘకాలిక ప్రణాళికతో మరిన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ బోర్డ్ సైంటిస్ట్ డా ఎస్ ఎస్ విఠల్, పి యాదయ్య సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రేమ్సాగర్ జియాలజీ శాఖ ప్రతినిధులు డా .మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy)పాల్గొన్నారు.