— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Madhusudan Reddy public service :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: విద్యా ర్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే జిల్లా విద్యాశాఖ కా ర్యా లయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీస ర్ గా పని చేస్తూ తన అధికారిక సహాయకు డిగా తనతో పాటు ప్రజలకు సేవ లు అందించిన మధుసూదన్ రెడ్డి సేవలు అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వద్ద అధికారిక సహాయకుడిగా పని చేస్తూ ఏప్రిల్ 30 న పదవీ విరమణ పొందిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీ సర్ మధుసూధన్ రెడ్డి పదవీ విర మణ సన్మాన కార్యక్రమం శుక్రవా రం నల్గొండ జిల్లా కేంద్రం సమీపం లోని ఎం.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు, భ వనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి ప్రభుత్వ సర్వీస్ నుండి ప దవి విరమణ పొందిన మధుసూ దన్ రెడ్డిని శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ తన సహాయకుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే తన ఉద్యోగ ధర్మానికి కూడా న్యాయం చేకూర్చి న మధుసూదన్ రెడ్డి సేవలు అభి నందనీయమని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మధుసూదన్ రెడ్డి భా ర్య జ్యో తి ,కూతురు శ్రీనిధి, జిల్లా పరిషత్తు సీఈఓ ప్రేమకరణ్ రెడ్డి, తది తరులు ఉన్నారు.