Buddhavanam Nagarjuna Sagar : ప్రజా దీవెన , నాగార్జున సాగర్ : బుద్ధమ్ శరణమ్ గచ్ఛామి, ధమ్మం శ రణమ్ గచ్ఛామి, బుధ్ధ జననం నుంచి మహభినిష్క్రమణం వరకు అన్ని దశలతో బుద్ధవనo నల్గొండ జిల్లా నాగార్జునసాగరంలో కొలు వుదీరి ఉంది. ఈ బుద్ధ చరిత వ నం, అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం.
తెలంగాణకు గొప్పవరం కాగా ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్దబు ధ్ధవనం పేరు గాంచి దాదాపు 279 ఎకరాల్లో విస్తరించి ఉండగా బుద్ధ వనానికి కేటాయించిన మొత్తం 2 79ఎకరాల్లో ప్రస్తుతం 90 ఎకరాల్లో ప్రపంచ దేశాలు సైతం ఆకర్షించేలా వున్న ఈ ప్రాజెక్టులో బుద్ధ చరిత వనం,జాతకవనం(బోధిసత్వపార్),ధ్యానవనం స్థూపవ నం, మహాస్థూ పం, బుద్ధిజం టీచింగ్,అండ్ ఎడ్యు కేషన్ సెంటర్, హాస్పిటాలిటీ, వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటుచేశారు.37 ఎకరాల్లో విపాసన ధ్యాన కేంద్రం ఏ ర్పాటును విశేషంగా చెప్పుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా 547 జాతక కథలుంటే ఇక్కడ భారతదేశంలో దొరికిన 40 ప్రసిద్ధ జాతక కథ శి ల్పాలను ప్రతిష్ఠించారు. భారతదే శంతో పాటు దక్షిణాసియాలోని వి విధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూ పాల నమూనాలను ఇక్కడ కను విందుగా ఏర్పాటుచేశారు. 100 అ డుగుల ఎత్తు, 200 అడుగుల వ్యా సం తో బౌద్ధ స్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాల నిర్మాణం మ యస భను తలదన్నేలా, చూపరులను ఇ ట్టే ఆకట్టుకునేలా వుంది. ఇది మన ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతి పెద్ద స్తూపం, శ్రీలంక నుండి తీసుకొచ్చిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమను అంగరంగ వైభ వంగా ఇక్కడ ఏర్పాటుచేశారు. స్తూపం గోడ లపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు శిల్పాలు ఏర్పాటుచేశారు.
అష్టాంగ మార్గాలకు ఎనిమిది పార్కులు ….బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనం
లో 8 పార్కులను ఏర్పాటుచేశా రు.మొదటిపార్కు లో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనా లు, రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు, మూ డోది ఆంధ్రా బుద్ధిజం పార్కు,నాలు
గోది ప్రపంచ స్తూపాల పార్కు, ఐదో పార్కులో 27 అడుగుల ఎత్తైన బు ద్ధుడి ప్రతిమ,ఆరవపార్కును ధ్యా నవనం, ఏడో పార్కులో మహాస్తూ పం, ఎనిమిదో పార్కును స్తూపవ నం ఏర్పాటుచేశారు.
సిద్ధార్ధుడి జననం …లుంబినీ వనంలో బుద్ధుడితల్లి సాల వృక్షం. సిద్దార్ధుడు ఒక్కో అడుగుకు ఒక్కో
పద్మావిర్భావం ఇదే నా చివరి జ న్మంటూ సిద్ధార్ధుడు వేలు పైకెత్తి చూపిస్తున్న దృశ్యం,మాయాదేవి
సిద్దార్ధుడికి జన్మనిస్తున్న శిలారూప దృశ్యాలు నభూతో నభవిష్యతి అ న్నట్లుగా ఉన్నాయి.
మల్వాల రాయితో చెక్కిన శిల్పాలు… కడప జిల్లా జమ్మల మడుగు నుంచి తీసుకొచ్చిన మ ల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. బుద్ధవనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పా లరాయిని వాడారు. బుద్ధుడి జీవి తం 22 రకాల చెట్లతో ముడిపడి ఉండడంతో ఇక్కడ 22 రకాల చె ట్లను పెంచుతున్నారు.
బుద్ధుడైన విధంబెట్టిదనిన … సిద్ధార్థుడు ఆహారం, నీళ్లుతీసుకో కుండా 48 రోజుల పాటు కఠోర సా ధన చేసి, హృదేలా గ్రామంలో సు జాతాదేవి ఇచ్చిన పాయసం స్వీక రించిన తర్వాత ఆయనకు జ్ఞానోద యం అవుతుంది. ఈ ఇతి వృత్తాం తాన్ని ప్రతిబింబిచేలా మహాస్తూపం కింది భాగంలో మోకాళ్ళ మీద కూ ర్చుని పాయసంతీసుకున్నట్లు ప్రతి మను చెక్కారు.
బుద్దవనం కథాకమీషూ… బుద్ధగయనుంచి రావిచెట్టు ను, శ్రీ లంకనుంచి తెచ్చిన ధమ్మగంటను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ధర్మచక్ర పరివర్తన సార్ నాథ్ జింకల వనం లో శిష్యులతో బుద్ధుడి సమావేశం దృశ్యాలు ఆకట్టుకుంటాయి.5 పిల్ల ర్లలో బుద్ధుడి జీవితాన్ని చిత్రీకరించారు. స్థూప పార్కు ప్రపంచంలో ఉ న్న బౌద్ధులు ఒకేచోట స్థూపన మూ నాలు చూసేవిధంగా నిర్మించిన ఈ పార్కులో సాంచీ, సారనాథ్, అజం తా,అమరావతి, కారలే, మాణిక్యా
ల 5 రకాల స్థూపాలనమూనాలు, వివిధ దేశాల్లోని మీర్‌పూర్‌ఖాస్ (పాకిస్తాన్), అనురాధపుర (శ్రీలం క), పగోడ (చైనా), చోర్‌టన్ (టిబె ట్),బౌద్ధనాథ్,(నేపాల్) తదితర 8 బౌద్ధస్థూపాల నమూనాలతో మొ త్తం 13 స్థూపాలు ఉన్నాయి.
అవకాన బుద్ధ ….శ్రీలంక, తెలు గుప్రజల మధ్యవున్న రెండువేల సంవత్సరాల అనుబంధానికి ప్రతీ కగా నాగార్జునకొండలో సింహళ వి హారం నిర్మించిన అప్పటి శ్రీలంక ప్ర భుత్వం,దానికి కొనసాగింపుగా బు ద్ధవనంలో 27 అడుగుల ఎత్తైన ఈ బుద్ధ విగ్రహంతో పాటు దమ్మగంట ను కూడా ఏర్పాటు చేశారు.
బుద్ధుడి జననం బుద్ధుడి జన నం గురించి తెలిసేలా ఒక మహావృ క్షం కింద మహిళ, ఆమె ముందు బాలుడులో ఒక శిల్పం ఉంది. సి ద్ధార్థుడు మాయాదేవికి లుంబినీ వ నంలో సాలవృక్షం కింద జన్మించా డని చెప్పడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది.
బుద్ధచరిత వనం:….గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన బుద్ధుడి జననం, మహాభినిష్క్ర మణ, తపస్సు చేయడం, ఉపన్యా సం,మరణంవంటి ఘట్టాలను ఇక్క డకంచు లోహాలతో పొందుపరిచా రు. బుద్ధుడు అహింసా మార్గాన్ని ఎంచుకున్న ఘట్టాలు, అడవులకు పోయిన సన్నివేశాలు, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన అంశాలకు సంబంధించిన శిల్పాలను ఈపా ర్కు లో ఏర్పాటు చేశారు.
ఆ నలుగురు …సిద్ధార్థుడు బా హ్య ప్రపంచంలోకి వచ్చిన తరువా త అక్కడ చూసి చలించిన ముస లి వ్యక్తి, రోగి, అంతిమ యాత్రగా వెళ్తున్న వ్యక్తి మృతదేహం, సాధు వు శిల్పాలను ఏర్పాటుచేశారు.
జాతక పార్కు… బుద్ధుడికి సంబంధించి ప్రపంచంలో వాడుక లో ఉన్న 547 జాతక కథలలో ప్ర ముఖమైన 42 కథ లను సేకరించి, వాటిని వివరించే విధంగా శిల్పాల రూపంలో ఈ పార్కులో పొందు పరిచారు.
మహాస్థూపం 21 మీటర్ల ఎ త్తు, 42 మీటర్లవ్యాసంతో ఓ మహా
స్తూపాన్ని నిర్మించారు. కాంక్రీట్‌తో నిర్మించినస్తూపాల్లో ఆసియా ఖం డంలోనే ఇది అతిపెద్దది.ఈస్తూప నిర్మాణానికి, 2000 సంవత్సరాల క్రితంగుంటూరు జిల్లా అమరావతి లో శాతవాహనులకాలంలోనిర్మిం
చిన స్తూప కొలతలను ప్రామాణికం గా తీసుకున్నారు.
ఈ మహాస్థూపం దక్షిణ భారత దే శంలోనే అతి పెద్దది.మహాస్థూప ని ర్మాణంలో అష్టాంగమార్గానికి గుర్తు గా 8 భాగాలను ఏర్పాటు చేశారు. ఇందులో మ్యూజియం, ఆడిటోరి యం, లైబ్రరీ ఉన్నాయి. ఆసియా లోనే అతి పెద్ద కాంక్రీట్ స్థూప నిర్మా ణానికి 128 మంది కళాకారులు పని చేశారు.మహాస్థూపం డ్రమ్, డ్రో మ్ భాగాలపై క్లిష్ట మైన శిల్పాలు మహాస్థూపం లోప ల ఆకాశం కింద తామర రేకులతో కూడిన వర్చువ ల్ అద్భుతంగా ఉంటుంది.
అహింసాయుతమైన అష్టాంగ మార్గాలు.. గౌతమ బుద్ధుడి జీవి తానికిసంబంధించిన అహింసాయు తమైన అష్టాంగ మార్గాలతో బౌద్ధ భిక్షువులను, పర్యాటకులను ఆక ర్షించేలా ఇక్కడ నిర్మాణాలను చేప ట్టారు.
ఆయకస్తంభాలు.. బుద్ధుడి జీ వితంలోనిముఖ్యమైన 5సంఘ ట నలనువివరించేలామహాస్తూపానికి నాలుగు వైపులా ఐదేసి చొప్పున ఆయక స్తంభాలను ఏర్పాటు
చేశారు.
సిద్ధార్థుడి జననం లుంబినీ వనంలో మాయాదేవికి సిద్ధార్థుడు జన్మించడం.
మహాభినిష్క్రమణం..నాలుగు విషాదకరమైన సంఘటనలు చూ సిన తర్వాత సిద్ధార్థుడు భార్యా పి ల్లలు, నగరాన్ని వదిలి తపస్సు కో సం అడవికి వెళ్లడం.
జ్ఞానోదయం గయలో సిద్ధార్థు డు తపస్సు అనంతరం బుద్ధుడిగా మారడం.
ధర్మచక్ర పరివర్తన: సారనాథ్ లోని మృగధావనంలో బుద్ధుడి మొదటి ఉపన్యాసం.
మహాపరినిర్యాణం 80వ యేట. బుద్ధుడి నిర్యాణం (మహాభినిష్క్రమణం)
మరికొద్దిసేపట్లో బుద్ధవనానికి 22 దేశాల మిస్ వరల్డ్ కంటె స్టెం ట్ లు
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొం టున్న ఆసియా ఓసియాన గ్రూప్ —4 లోని 22 దేశాల సుందరీమణు లు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని మరికొద్ది సేపట్లో
సాయంత్రం 5 గంటలకు సందర్శిం చనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందగత్తె లు మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొం టుండగా ఆసియా ఒసియాన దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, కాం బోడియా ,మయన్మార్ వియత్నం, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ ,ఇండోనేసియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తా న్, లెబనాన్, మంగోలియా, నేపా ల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సిం గపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థా యిలాండ్, ఆర్మేనియా నుంచి వ చ్చినవారు మాత్రం బుద్ధవనం సం దర్శిస్తారు.
సందర్శనలో భాగంగా మిస్‌వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పా ల్గొంటారు. ప్రత్యేకించి ఆయా దేశా ల ఆచారాలు, సంప్రదాయాల ప్రకా రం ప్రార్థనలు నిర్వహించనున్నా రు.
పర్యాటక శాఖ అధికారులు ఈ రో జు మధ్యాహ్నం హైదరాబాద్ నుం చి ప్రత్యేక బస్సులో వీరినీ నాగార్జు నసాగర్‌కు తీసుకువెళ్లారు. మార్గ మధ్యమంలో నల్లగొండ జిల్లా చిం తపల్లి సమీపంలోని అతిథిగృహం వద్ద కొంతసేపు మిస్ వరల్డ్ కంటె స్టెంట్ లు ఆగుతారు. అక్కడ ప ర్యాటక సంస్థ విజయ్‌విహార్‌లో కొం తసేపు విశ్రాంతి తీసుకుని ఫొటో సెషన్ తర్వాత అక్కడినుంచి నేరు గా బుద్ధవనం చేరుకుంటారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అ నుగుణంగా మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం ఈ ఫీల్డ్ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ సందర్శనకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు.