vaisnavi : ప్రజా దీవన, నారాయణపురం : చౌటుప్పల్ కోర్టు ఆవరణలో కోర్టు మరియు బార్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు చౌటుప్పల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహంతి వైష్ణవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.వారు కోటవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడుతూ న్యాయవాదులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత న్యాయవాదులుగా మీపై ఉందని తెలియజేశారు.
బారాసోసియేషన్ అధ్యక్షుడు ఉడువు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదులమంతా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ఉంటాము అన్నారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ కోర్ట్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా బారాసోసియేషన్ లోని ప్రతి న్యాయవాదికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహంతి వైష్ణవి గారిని బార్ అసోసియేషన్ హలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ తాడూరి పరమేష్,సంయుక్త కార్యదర్శి జల్లా రమేష్ స్పోర్ట్స్ సెక్రటరీ,మక్తల్ నరసింహ,లేడీ రిప్రజెంటేటివ్ స్వాతి,జగత్తుల శేఖర్,సీనియర్ న్యాయవాదులు బాల్యం వెంకటాచలం,ఎలమొని శ్రీనివాస్,ఎస్సార్ బిక్షపతి,నరసింహారెడ్డి, రవీందర్,జంగయ్య,సత్యనారాయణ,శ్రీశైలం యాదవ్,కోర్టు సిబ్బంది సూపర్డెంట్ నరేష్,ఉమర్,తదితరులు పాల్గొన్నారు.