Mahatma Gandhi Jayanti: ప్రజా దీవెన, కోదాడ: మహాత్మా గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti)సందర్భంగా కోదాడ పట్టణ బిఆర్ యస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యబాబు ఆధ్వర్యంలో బుధవారం గాంధీ పార్క్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి (Mahatma Gandhi statue)పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసినివాళులుఅర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ.మహాత్ముల త్యాగాల ఫలితంగానే ఈ రోజు మనం దేశంలో స్వతంత్రంగా బతుకుతున్నాం అన్నారు. మహాత్ముల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. గాంధీ జయంతి రోజు వైన్ షాపులు (Wine shops)బంద్ చేసినప్పటికీ బెల్ట్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడం చాలా బాధాకరమన్నారు. బెల్ట్ షాపుల్లో గాంధీ జయంతి రోజు మద్యం దొరకకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేదర లలిత, గట్ల కోటేశ్వరరావు,కర్ల సుందర్ బాబు, సుంకర అభిదర్ నాయుడు, మజాహర్, చలిగంటి వెంకట్, అబ్బు బకర్, గొర్రె రాజేష్ నిసార్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.