Mahatma Gandhi :ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించి అనంతరం స్వతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించే శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, డా శ్రీదేవి డా సురేష్ రెడ్డి, డా అరుణప్రియ, డా మారం వెంకటరమణారెడ్డి తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.