— ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాం గణాలను అంతర్జాతీయ ప్రమాణా లతో తీర్చిదిద్ద నున్నట్లు ఉప కుల పతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సే న్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో గల 2160 స్క్వేర్ మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్ , 400 మీటర్ల ఎనిమిది లేను ట్రాక్ ను సింథటిక్ ట్రాక్ గా మార్చేందుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసినట్లు తెలిపారు. ఈ అధునాతన సింథటిక్ ట్రాక్ తో ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్ బాల్, షటిల్, కబడ్డీ వంటి వివిధ రకాల క్రీడా అంశాలపై విద్యార్థులకు ట్రైనింగ్ కు అవకాశం ఉంటుందన్నారు.
ఉపకులపతి కార్యాలయం వేదికగా జరిగిన ఒప్పంద పత్రాల మార్పిడి అనంతరం ఈపిఐ ప్రతినిధులు నారాయన్ నాయక్, మాట్లాడుతూ రాబోవు విద్యా సంవత్సరంలో ఈ అధునాతన క్రీడా ప్రాంగణాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డా హరీష్ కుమార్, ఆచార్య ఆకుల రవి, స్పెషల్ ఆఫీసర్ ఆచార్య సోమలింగం, ఈ పి ఐ, ఏజీఎం, డీజీఎం, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, కోఆర్డినేటర్, జాయింట్ సెక్రటరీలు డా మురళి, డా శ్రీనివాసరెడ్డి, డా చింత శ్యాంసుందర్ లు పాల్గొన్నారు.