–ఎంజియూ విసి కాజా అల్తాఫ్ హుస్సేన్
–గణిత శాఖ ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం
Mahatma Gandhi University : ప్రజాదీవెన నల్లగొండ : మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సైన్స్ కళాశాల లోని గణిత విభాగం, ఎంటిటిఎస్ ట్రస్ట్ సంయుక్తంగా ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఆర్థిక సహకారం అందిస్తుంది. అన్ని రాష్ట్రాల నుండి డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వడపోత చేయగా 51 విద్యార్థులు ఈ శిక్షణకు ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత ఎప్పుడైతే క్రమశిక్షణ, జ్ఞానం పొందడం, ఇతరులకు సహాయం చేయడం చేయడం వల్ల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడతాయని, ఆ విషయాలపై స్పష్టత ఉండాలని సూచించారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు కళాశాల తరఫున అన్ని విధాల సహకరిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన రిజిస్టార్ అల్వాల రవి, హాస్టల్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. గణిత విభాగ అధిపతి డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షత వహిస్తుండగా ఆరు రోజుల శిక్షణ కార్యక్రమానికి గణిత శాఖ బిఓఎస్ డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి, కోఆర్డినేటర్ గా డాక్టర్ సముద్రాల ఉపేందర్ స్థానిక కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమానికి నిపుణులుగా ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి, శివనాడార్, యూనివర్సిటీ ఢిల్లీ ప్రొఫెసర్ సుకుమార్, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ శివాజీ గణేషన్, పాల్గొంటారు. కాగా ఈ కార్యక్రమంలో గణిత విభాగ అధ్యాపకులు డాక్టర్. డి. ఐమావతి, డాక్టర్. ఎ. శ్రీనివాస్, డాక్టర్.ఎన్. కిరణ్ కుమార్, డాక్టర్. రామచంద్రు వివిధ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు.