Mahesh Goud : వివేకానందుని జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి .ఘనంగా జాతీయ యువజన దినోత్సవం బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానగంటిమహేష్ గౌడ్
ప్రజా దీవెన ,మర్రిగూడ : జనవరి 13 హైందవ సంఘటన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడు అందుకు యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానుగంటి మహేష్ గౌడ్ అన్నారు ఆయన ఆదివారం రోజున జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రంలో వివేకానంద స్వామి 162 నుజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు .
స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలన్ని వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇనుప కండరాలు వచ్చే సంకల్పం కలిగిన వంద మంది యువకులు నాతో ఉంటే దేశ స్వరూపాన్ని మారుస్తానని స్వామీజీ మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు బలమే జీవనం బలహీనత మరణం అని చాటి చెప్పిన వివేకానందుడు ప్రసంగాలు పోరాటస్ఫూర్తిని కలిగిస్తాయని అన్నారు నేటి యువత వివేకానందును జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ జీవనంలో మార్పు తీసుకోవాలి అనికోరారు ఈ కార్యక్రమంలో పగడాల నాగేష్ వెంకటంపేట అంజి నాగిళ్ల మారయ్య తదితరులు పాల్గొన్నారు