Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahila Congress : జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేస్తాం

–మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో మూడోస్థానం

–జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి

Mahila Congress : ప్రజాదీవెన , నల్లగొండ : రాజకీయాలలో మహిళలను ముందంజలో ఉంచేందుకు జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి విధంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి అన్నారు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా కాంగ్రెస్ రివ్యూ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో జిల్లా మూడో స్థానంలో ఉందని తెలిపారు. మహిళా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలలో చోటు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. మరికొందరికి త్వరలోనే అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.

   మహిళలను రాజకీయంగా చైతన్యవంతం చేసి సభ్యత్వం ఇచ్చేందుకు మెంబర్ షిప్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా మహిళా కాంగ్రెస్ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చిన విజయవంతం చేసే దిశగా పనిచేయాలని కోరారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు.
దీనిపై త్వరలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

   ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజిత, కార్యదర్శి శ్రీలత రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జానకి, కందిమల్ల నాగమణి రెడ్డి, ఉపాధ్యక్షురాలు సుజాత, చింతపల్లి సదాలక్ష్మి, కార్యదర్శి జక్కలి లలిత, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, సూరెడ్డి సరస్వతి, స్వరాజ్యలక్ష్మి, రుద్రమ్మ, నిర్మల, నవనీత, స్వరూపారెడ్డి, లింగమ్మ, కారింగు పల్లవి, లలిత, పందిరి రాధా, ఏ. పద్మ, పావని, పరమేశ్వరి, సిహెచ్ .రంగమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.