Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahila Shakti canteens: మహిళా శక్తి క్యాంటీన్ లు

రాష్ట్రం లో మహిళా శక్తి క్యాంటీన్లను(Mahila Shakti canteens) ఏర్పా టు చేయనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నామని ప్రకటించారు.

మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు
మహిళా సంఘాల బలోపేతానికే ఈ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్య దర్శి సీఎస్‌ శాంతి కుమారి

ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్రం లో మహిళా శక్తి క్యాంటీన్లను(Mahila Shakti canteens) ఏర్పా టు చేయనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నామని ప్రకటించారు. క్యాంటీన్ల ఏర్పాటుపై గురువారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలో పేతం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసు కున్నారని సీఎస్‌ తెలిపారు. అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయా లు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతా ల్లో మహిళా సంఘాల నిర్వహణలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయను న్నామని తెలిపారు.

ఇప్పటికే ‘దీదీ కీ రసోయీ’ పేరిట పశ్చిమబెంగా ల్‌లో (West Bengal)నడుస్తున్న క్యాంటీన్లపై అధ్య యనం చేసినట్లు చెప్పారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టు కున్నామని, వీటి నిర్వహణను గ్రామ ఐక్య సంఘాలకు అప్పగించ నున్నామని తెలిపారు. ఈ సంఘా లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఈ క్యాంటీన్లకు ఏర్పాటు, నిర్వహ ణ, వీటికి ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం తదితర అంశాలపై ప్రణా ళిక రూపొందించాలని గ్రామీణా భి వృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ కమి షనర్‌(Anita Ramachandran) అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు.

Mahila Shakti canteens released