BJP State President Tour : ప్రజా దీవెన, కోదాడ: జులై 14వ తారీకు నా భారతీయ జనతా పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్న సందర్భంగా పర్యటనను విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు జిల్లా ప్రబారి రాజమౌళి కార్యకర్తలకు పిలుపునిచ్చారు శనివారం పట్టణ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ఎన్ రామచంద్ర రావు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం అయిన తర్వాత మొదటిసారి వారి సొంత ప్రాంత అయిన సూర్యాపేట జిల్లాకు విచ్చేయుచున్న సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరూ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు ప్రతి పోలింగ్ బూత్ నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, రాష్ట్ర నాయకులు కనగాల వెంకటరామయ్య, నూనె సులోచన, కడియం రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, హనుమంతరావు, ఓరుగంటి కిట్టు, జిల్లా జనార్ధన్ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు