Mallam Mahesh: ప్రజా దీవెన, శాలిగౌరారం: కేంద్ర ప్రభుత్వం (Central Govt) యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపించ కుండా నిర్వీర్యం చేస్తుందని డివైఎ ఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ (Mallam Mahesh)అన్నారు.భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య శాలి గౌరారం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఎం పార్టీ కార్యా లయం లో జరిగింది. ఈ సమా వేశానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం (Central Govt)యువతకు ఉద్యోగాలు కల్పిం చకుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ కాలం వెళ్లదీస్తుం దన్నా రు.
అధిక శాతం యువత కలిగిన మన దేశంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి భవి ష్యత్తు కార్యాచరణ లేకుండా వారికోసం ప్రత్యేక బడ్జెట్ (Budget) కేటా యించకుండా యువతను మోసం చేస్తుందన్నారు ఉద్యోగాలు కల్పిం చాలంటే పకోడీలు వేసుకోవాలని చెప్పు వారి వారసులకు మాత్రం ఎలాంటి అర్హత లేకుండా పదవుల లో కట్టబెడుతున్నారు. వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పించా లని డిమాండ్ (demand)చేశారు ఈ సమా వేశంలో డివైఎఫ్ఐ మండల నాయ కులు బట్ట చిన సైదు లు,చలకాని కుమార్,చింత ప్రసాద్,బట్ట సాయి కుమార్, జూలూరు అరవింద్ లు పాల్గొన్నారు.