బోనస్ పేరు తో రైతులనుప్రభుత్వం మోసం చేసింది
*యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ తెచ్చింది ఎవరు
*కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టం రోడ్ వైండింగ్ నా హయాంలోనే జరిగింది
*కోదాడలో పదేళ్లు ఉత్తమ్, ఐదేళ్లు పద్మావతి చేసింది శూన్యం
*శిలాఫలకాలికే పరిమితమయ్యా రూ తప్పా తట్టెడు మట్టి పూసింది లేదు
*ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయండి: మల్లయ్య యాదవ్
ప్రజా దీవెన,కోదాడ: గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం శిలాఫలకాలకే పరిమితమైనది తప్ప ఎక్కడ తట్టెడు మట్టి పోసి పనులు చేసింది లేదని కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్నిఎద్దేవా చేశారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రై… రై… మంటూ మంత్రులతో తిరగడం తప్ప అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు.
కోదాడ నియోజకవర్గానికి 10 ఏళ్లు ఉత్తం, ఐదేళ్లపాటు ఆయన సతీమణి పద్మావతి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వాళ్ళ హయాంలో కోదాడ మురికి కూపంగా మారిందన్నారు. కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్డు వైడింగ్ పనులు తన హయాంలోనే జరిగాయన్నారు. రైతులు వరి పంట వేసేటప్పుడు సన్నాళ్లకే బోనస్ అని వ్యవసాయ శాఖ అధికారులతో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. వరి ధాన్యానికి బోనస్ పేరు మీద ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
ఆయకట్టు కింద పండిన ధాన్యాన్ని ఈ ప్రాంతంలో మిల్లర్లు ఉండబట్టి కొనుగోలు చేశారే తప్ప ప్రభుత్వం ఘనత ఏదీ లేదన్నారు. ఫోటోల కోసం ఫోజుల కోసం పేపర్లలో వార్తల కోసం ఐకెపి కేంద్రాలు తొలుత ప్రారంభించారని తాము తిరిగిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి కొనుగోలు చేసిందన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం మోసం చేసిందని దుయబెట్టారు.
యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ తెచ్చింది ఎవరని తాము మొదలుపెడితే దాన్ని ప్రారంభించుకుంటూ ముఖ్యమంత్రి మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు . గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోయింది అన్నారు. గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని సర్పంచులు అడిగితే అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. విహారయాత్రల పేరుతో హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వేటగా విమర్శించారు.
అధికార దాహంతో అందిన కాడికి దోచుకుంటూ ప్రజలను అభూత కల్పనాలతో మోసాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ సమావేశంలో టౌన్ పార్టీ అధ్యక్షులు నయీం, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు భట్టు శివాజీ నాయక్, అనంతుల ఆంజనేయులు, శెట్టి సురేష్ నాయుడు, నాగిరెడ్డి, పిట్టల భాగ్యమా, సుందర్ బాబు, రాంబాబు గౌడ్, రాజేష్, అప్పారావు, పూర్ణచంద్రరావు, మొత్తం రమేష్, ఏడుకొండలు, యూత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.