Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallya Yadav: విద్యార్థులు,యువత దేశ భక్తిని పెంపొందించు కోవాలి

— స్వతంత్ర సమరయోధుల త్యాగాల తోనే నేటి స్వేచ్చా స్వతంత్ర్యాలు

— భవిష్యత్ తరాలు దేశ స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర ను తెలుసుకోవాలి
— మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Mallya Yadav: ప్రజా దీవెన, కోదాడ: యువత దేశ భక్తిని పెంపొందించు కోవాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ (Mallya Yadav) అన్నారు. గురువారం కోదాడ పట్టణం లోని బిఆర్ఎస్ పార్టీ (BRS party)కోదాడ నియోజకవర్గ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.వారి త్యాగాలే నేటి స్వేచ్చా స్వాతంత్ర్యాలు అన్నారు.

భవిష్యత్ తరాలు స్వతంత్ర సమరయోధుల (Freedom fighters)చరిత్రలను తెలుసుకోవాలన్నారు. భారతదేశంలో భిన్న మతాలు విన్న కులాలు అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రాముఖ్యతను (Importance of India)చాటుకుంటుందని తెలిపారు. స్వతంత్ర సమరయోధుల (Freedom fighters) స్ఫూర్తి తీసుకొని విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవిత రాధారెడ్డి , మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాయిం, మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, యుత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, కౌన్సిలర్ మామిడి రామారావు గట్ల నరసింహారావు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, వార్డు అధ్యక్షులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.