Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mamilla Sridhar Reddy: న్యూ ఇయర్ వేడుకల పేరుతో తోటి పౌరులకు అసౌకర్యం కలిగించే వారిపైకఠినచర్యలు :డి.ఎస్.పి

ప్రజా దీవెన, కోదాడ: నూతన సంవత్సరం వేడుకల పేరుతో తోటి పౌరులకు బసౌకర్యం కలిగే విధంగాప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కుంటామని కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కోదాడ ప్రాంత ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా ప్రజా భద్రతను, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నామని
నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామని తెలిపారు

ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైకులు, కార్లను ఇస్తే..వారు ఆ వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా లేక మద్యం, మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగి జరిగే అవకాశం ఉందని. కావున ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకొవాలి. తెలిపారు న్యూ ఇయర్ సందర్భంగా “డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు, అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు న్యూసెన్స్ చేసే వారిపై చర్యలు తీసుకోబడును.31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ పౌరులను అసౌకర్యం కలిగే విధంగా తిరిగే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.

ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట లోపు పూర్తిచేసుకుని తమ తమ ఇళ్లకు వెళ్లాలని కోరుచున్నాము.అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.