Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mamunur Airport : అన్నదాతల అభ్యంతరం, మాకొద్దు బాబో మామునూరు ఎయిర్ పోర్టు

Mamunur Airport : ప్రజా దీవెన, మామునూరు : తెలం గాణలో ఇటీవల విస్త్రుత ప్రచారం లోకి మాములూరు తాజాగా రోడ్డె క్కి మరో మార్గంలో ప్రపంచ వ్యా ప్తంగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సొమ్ము చేసు కుంటోంది. ఏది ఏమైనా మాము నూరు ఎయిర్‌పోర్టు (Mamunur Ariport) వద్ద ఉద్రిక్తత చోటు చేసు కుంది. ఎయిర్ పోర్ట్‌కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే యాలని అన్నదాతలు మంగళ వా రం ఉదయం నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.

 

 

తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందో ళనకు దిగారు రైతులు. ఆందోళ నలో భారీగా మహిళలు పాల్గొ. న్నారు. సమాచారం అందిన వెంటనే మామూనూరు ఎయి ర్‌పోర్టు వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. మామునూరు ఎయిర్‌పోర్టు రావడం సంతోష కరమే అయినా భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాములూరుకు సమీపంలో ఉన్న గవిచర్ల క్రాస్‌ రోడ్డు మీదుగా నక్క లపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్‌పోర్టులో కలిసిపోతుంది.

రహదారి మూసివేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. నక్కలపల్లి ప్రధాన రహ దారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఎయిర్‌ పోర్టును తామేమి వ్యతిరేకించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం రావడం సంతోషకరమన్నారు. ఎయిర్‌పోర్టు రావడం వల్ల ఎంతైతే లాభపడుతు న్నామో అంతకంటే ఎక్కువ నష్టపో తున్నామని రైతులు వాపోతు న్నారు. తమకు న్యాయం చేయా లని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లినా సరైన స్పందన రాకపోవ డం తో ధర్నాకు దిగినట్లు వారు తెలిపారు.

మార్కెట్ వాల్యూ ప్రకారమే రేట్ ఇస్తామని లేదా రైతులు కోరు కున్న చోటే వ్యవసాయ ఆమోద యోగ్యమైన భూములు ఇస్తామని మంత్రి సురేఖ చెప్పారని అన్నారు. నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పి స్తామని కూడా మాట ఇచ్చినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు భూ ములకు భూమి ఇవ్వకపోవడమే కాకుండా.. తమ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని కూడా మూసి వేస్తున్నారని.. అంతే కాకుండా కొత్తగా రోడ్డు మార్గానికి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదని అన్న దాతలు వాపోయారు. తమకు కచ్చితంగా న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

అధికారులను అడ్డుకున్న రైతులు నిలిచిన సర్వే కాగా తెలంగాణ రెండవ ఎయిర్‌పోర్టుకు మార్గం సుగమం అయిన నేపథ్యంలో ఇ క్కడ భూసేకరణకు అధికార యం త్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం భూసేకరణ సర్వే చేయాలని నిర్ణ యించారు అధికారులు. అయితే సర్వేను అడ్డుకునేందుకు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. కాసేపటి క్రితమే ఎయిర్ పోర్ట్ భూసేకరణ సర్వేకో సం హనుమకొండ ఆర్డీవో సత్య పాల్ రెడ్డి, తహసీల్దార్ నాగే శ్వ రరావు అక్కడకు వెళ్లారు.

దీంతో అధికారులను రైతులు, మహిళలు నిలదీశారు. తమకు న్యాయం చే యాలని అధికారులను నిర్వా సితులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్‌తో వరంగల్ ఆర్డీవో, తహసీల్దార్ ఫోన్ లో సంప్రదింపులు జరుపారు. ప్రస్తు తం భూసేకరణ సర్వే తాత్కా లికంగా నిలిచిపోయింది.