రాచకొండ సిపి ముందు మంచు మనోజ్ బైండోవర్
ప్రజా దీవెన, హైదరాబాద్: నటుడు మంచు మోహన్ బాబు కుటుం బ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమో దైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి స్పందిస్తూ మంచు మనోజ్ ఈరోజు నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ముందు హాజరయ్యా రు. వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన గొడవకు సంబం ధించి విషయాలలో మంచు మనోజ్ యొక్క వాంగ్మూలం తీసుకు న్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చ కూడదని, ఇరు వర్గాలు శాంతి యుతంగా సమస్యను పరిష్కరించు కోవాలని సూచించారు.
వారి కుటుంబ వివాదాల నేప థ్యంలో వారి యొక్క చర్యలు సమా జంలోని ఇతర వ్యక్తులకు మరియు ఆ చుట్టుపక్కల ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లయితే చర్య తీసుకోవడం జరుగు తుందని మరోసారి గొడ వలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించి సంయమనం పాటించాలని సూచించారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఒక సంవత్సరం కాలం పాటు శాంతి కాపాడడానికి ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉంటానని బాండ్ ఇవ్వడం జరిగింది.
ఇదే రోజు సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజర య్యారు అనంతరం కమిషనర్ గారికి తన తరఫు వాదనలు వినిపిం చి తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటు వంటి ఉత్తర్వుల గురిం చి తెలియ జేసినాడు. ఇట్టి వివాదంలో అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దు, శాంతిభద్ర తలకు విఘాతం కలి గించరాదు అని కమీ షనర్ తెలి యజేసి, తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్య ల గురించి తెలియ జేయడం జరుగుతుందని అప్పటివరకు శాంతి భద్రత ఎలాం టి విఘాతం కలిగించిన వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పారు.
Manchumanoj