30 ఏళ్ల నిరీక్షణ నెరవేరిన కల ఆత్మగౌరవ పోరాటం గెలిచింది.
Mandakrishna Madiga: ప్రజా దీవెన కోదాడ: 30 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ (Mmarps) ఆధ్వర్యంలో జరిగిన వర్గీకరణ పోరాటం నిర్వహించారు నేడు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పుయడంతో మాదిగుల కల నెరవేరిందని కోదాడ ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. కోదాడ పట్టణంలో స్థానిక శకుంతల థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) చిత్రపటానికి పాలాభిషేకం (Palabhishekam) కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు సుమారు 30 సంవత్సరాలగా ఆత్మగౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించారని నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వటంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నామని తెలపటంతో కోదాడ పట్టణంలో ఎం ఆర్ పి ఎస్ ఎం ఆర్ పి ఎస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాలాభిషేకాలు (Palabhishekam) సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి రాజు మాదిగ ,పడిశాల రఘు, మాతంగి గాంధీ ,తోటపల్లి నాగరాజు, ఏపూరి సునీల్ రత్నాకర్. సీమ శేఖర్ ,పెడమర్తి వెంకటరావు, పెడమర్తి పెద్ద వెంకటరావు, తదితరులు పాల్గొన్నారుఇతర సంఘాలు