–విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
–తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలి
–భవిత కేంద్రాల మెటీరియల్ స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం వాతావరణం వేసవి లాగ ఉన్నందున భవిత సెంటర్లో, కేజీబీవీ స్కూళ్లలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని, మండల విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ సిబ్బందిని కోరారు.
మండల ప్రత్యేక అధికారులు భవిత సెంటర్లలో వచ్చిన మెటీరియల్ ను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లో సంతకం చేయాలని చెప్పారు.
అనంతరం పరిశ్రమలు, వాణిజ్య శాఖ (డి ఈఈ టి) ఆధ్వర్యంలో రూపొందించిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
కాగా ఈ సోమవారం మొత్తం 138 ఫిర్యాదులు రాగా, రెవిన్యూ శాఖకు 82 జిల్లా అధికారులకు 56 వచ్చాయి. అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, డిఆర్ డిఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి కోటేశ్వరరావు, జిల్లా అధికారులు, ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.