— తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
Mandula samel : ప్రజాదీవెన : సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని తుంగతుర్తి శాసనసభ్యులు మందు ల సామెల్ అన్నారు. రైతు భరో సా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికై నిర్వహిస్తున్న గ్రామస భలలో భాగంగా మంగళవారం ఆయన శాలిగౌరారం మండలం వంగమర్తి లో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి హాజరయ్యారు. ఈ సం దర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి అమలు చేయ నున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కు గ్రామసభలు నిర్వహించి లబ్ధి దారులను ఎంపిక చేయాలని ఆదే శించిన నేపద్యంలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు .ఈ గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని కోరారు.
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏర్పాటైన సమయంలో 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండేదని, అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టలేదని, ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, యు వత, రైతులు ,విద్యార్థులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను దృ ష్టిలో ఉంచుకొని ప్రజాపాలన కొన సాగించాలని నిర్ణయించడం జరి గిందని , అందుకే అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా పథకాలకు దరఖాస్తులు తీసుకోవడం జరి గిందని, అర్హులైన వారి పేర్లను గ్రా మసభల ద్వారా చదివి వినిపించి గ్రామసభల ఆమోదం పొందిన త ర్వాత వారికి ఆయా పథకాల కింద లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. జాబితాలో ఎవరి పేర్లైనా రాకుం టే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఆయా పథకాలకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రామసభ లోనే దరఖాస్తు సమర్పించవచ్చని, ఒకవేళ ఎవరైనా గ్రామ సభకు రానివారు ఉంటే ఎంపీడీవో కార్యా లయంలోని ప్రజాపాలన మీ- సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రేషన్ కార్డులు, ఇందిర మ్మ ఇండ్లు,రైతు భరోసా, ఆత్మీయ భరోసాను అర్హులైన అందరికీ ఇవ్వడం జరుగుతుందని అందు వల్ల ఎవరు చింతించాల్సిన అవస రం లేదని చెప్పారు. ఈ కార్యక్ర మాలు నిరంతరం కొనసాగుతాయ ని ఆయన స్పష్టం చేశారు. అభివృ ద్ధిలో భాగంగా చిత్తరువు నుండి హైవే వరకు రెండు కోట్ల రూపాయ లతో రహదారి మంజూరు అయిం దని త్వరలోనే పనులు చేపట్టను న్నట్లు ఆయన వెల్లడించారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, శాలిగౌరారం ప్రత్యేక అధికారి ,ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన్య నాయ క్, ఎంపీడీవో ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.