Mantipalli Srisailam: నాంపల్లి ప్రజా దీవెన జనవరి 11 తెలంగాణ భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నాంపల్లి మండల పరిధిలోని మల్లపు రాజు పల్లి గ్రామానికి చెందిన మంమట్టిపల్లి శ్రీశైలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక జిల్లా బిజెపి ఎన్నికల సంస్థ అధికారి కట్టా సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. శ్రీశైలం జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల తన సొంత గ్రామమైన మల్లపురాజపల్లి గ్రామస్తులు మండల బిజెపి నాయకులు కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ఎన్నికకు సహకరించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ గ్రామస్థాయిలో గెలిపించే విధంగా కృషి చేస్తానని శ్రీశైలం పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.