Manya Naik: ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొండ జిల్లా ఎస్ సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ ఎం. మాన్యా నాయక్ (Manya Naik) శాలిగౌరారం మండల ప్రత్యేక ధికారిగా నియమితుల య్యారు. బుధవారం అయన ఎంపీడీఓ కార్యాలయం (MPDO Office) లో భాద్యతలు స్వీకరించారు.
శాలిగౌరారం మండల ప్రత్యేక అధికారి గా పనిచేసిన ఎం. చరిత (M. Charita) నార్కెట్పల్లి మండలానికి కేటాయించారు. ఈ సందర్బంగా మాన్యానాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పై దృష్టి పెట్టి మండలాన్ని జిల్లా స్థాయిలో ముందుంచాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, సూపరిండెంట్ గాదరి సుందరయ్య ఉన్నారు.