మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి
ప్రజా దీవెన/ పెద్దపెల్లి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూశారు. తెలిసిన వివరాల ప్రకారం అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం.
రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు.మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. గ్రామానికి చెందిన వాడు మల్లారెడ్డి కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌గఢ్, ఒడిశాదండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.