Maoists: ప్రజా దీవెన, వాజేడు : భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ (Communist Party of India is Maoist)జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరిట మావోయిస్టులు సోషల్ మీడియా లో లేఖ విడుదల చేశారు. జేఎం డబ్ల్యూపీ డివిజన్ లోని ఏటూరు నాగారం, మహాదేవపూర్ దళంలోని నిరాయుధులైన ముగ్గురు సభ్యులు జై సింగ్, రమేష్, సుక్కిని (The three members are Jai Singh, Ramesh and Sukki) ఈనెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు పట్టుకుని కనబడకుండా దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయ త్నం చేస్తున్నారు.
అరెస్టు (arrest)చేసిన వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాలి, వారికి ఎలాంటి హాని జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలి.ఈ అరెస్టును (arrest)ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులందరూ ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పొందుపరిచారు. సోషల్ మీడియా వేదికగా మావో యిస్టులు లేఖ విడుదల చేయడం తో ములుగు జిల్లా పరిధిలోని వాజే డు వెంకటాపురం ఏజెన్సీ మండలా ల్లో అలజడి మొదలైంది. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరు గుతున్న నేపథ్యంలో లేఖ విడుదల కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న వార్ లో ఏ క్షణం ఏం జరుగుతుందో నని ఏజెన్సీ ప్రజలు బిక్కుబి క్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
